Breaking News

ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌..


Published on: 20 May 2025 17:24  IST

ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దీంతో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు. లసిత్ మలింగ, జస్ర్పీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ లను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డును నమోదు చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు.

Follow us on , &

ఇవీ చదవండి