Breaking News

అమెరికా స్వాతంత్ర్య ప్రకటన జరిగి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో కూడిన ప్రత్యేక పరిమిత ఎడిషన్ పాస్‌పోర్ట్‌ల విడుదల

అమెరికా స్వాతంత్ర్య ప్రకటన జరిగి 250 ఏళ్లు (Semiquincentennial) పూర్తవుతున్న సందర్భంగా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో కూడిన ప్రత్యేక పరిమిత ఎడిషన్ (Limited Edition) పాస్‌పోర్ట్‌లను విడుదల చేయాలని అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. 

Published on: 29 Apr 2026 10:16  IST

అమెరికా స్వాతంత్ర్య ప్రకటన జరిగి 250 ఏళ్లు (Semiquincentennial) పూర్తవుతున్న సందర్భంగా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో కూడిన ప్రత్యేక పరిమిత ఎడిషన్ (Limited Edition) పాస్‌పోర్ట్‌లను విడుదల చేయాలని అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. 

ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్ లోపలి కవర్‌పై ట్రంప్ అధికారిక చిత్రం ఉంటుంది. దాని కింద ఆయన సంతకం బంగారు వర్ణంలో (Gold Signature) ముద్రించబడి ఉంటుంది.పాస్‌పోర్ట్‌లోని మరో పేజీలో అమెరికా వ్యవస్థాపక పితామహులు (Founding Fathers) స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేస్తున్న చారిత్రక పెయింటింగ్ ఉంటుంది.ఈ స్మారక పాస్‌పోర్ట్‌లు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జూలై 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి సాధారణ పాస్‌పోర్ట్‌ల స్థానంలో కాకుండా, కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాదాపు 25,000 కాపీలు మాత్రమే ముద్రించనున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.పాస్‌పోర్ట్‌లతో పాటు అమెరికా కరెన్సీ నోట్లపై కూడా ట్రంప్ సంతకం కనిపించబోతోంది. ఒక దేశాధ్యక్షుడి సంతకం నోట్లపై ఉండటం ఇదే మొదటిసారి. 

Follow us on , &

ఇవీ చదవండి