Breaking News

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. మే 4, 2026న జరుగుతున్న ఓట్ల లెక్కింపులో, సుమారు 15 ఏళ్ల మమతా బెనర్జీ (దీదీ) పాలనకు బ్రేక్ వేస్తూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.


Published on: 04 May 2026 15:47  IST

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ  చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. మే 4, 2026న జరుగుతున్న ఓట్ల లెక్కింపులో, సుమారు 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ వేస్తూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గానూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 190కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండి ఘన విజయం దిశగా సాగుతోంది.అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) కేవలం 95-100 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

నందిగ్రామ్: బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తన సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంలో ఉన్నారు.

భవానీపూర్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వెనుకబడటం గమనార్హం.ఆర్.జి. కర్ ఘటన మరియు సందేశ్‌ఖాలీ వంటి ఇష్యూలు దీదీ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.బెంగాల్‌తో పాటు తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అనూహ్య ఫలితాలతో దూసుకుపోతుండగా, అసోంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి