Breaking News

విశాఖలో కుప్పకూలిన స్లాబ్ ఒకరు మృతి

విశాఖపట్నం జిల్లా గాజువాకలోని వికాస్ నగర్ వద్ద మే 3, 2026 ఆదివారం సాయంత్రం ఒక భవనం స్లాబ్ కుప్పకూలింది. రోడ్డు విస్తరణ కారణంగా కిందకు వెళ్ళిపోయిన ఒక పాత భవనాన్ని  హైడ్రాలిక్ జాకీల సహాయంతో పైకి లేపుతుండగా, ఒక్కసారిగా ఆ భవనం స్లాబ్ కూలిపోయింది.

Published on: 04 May 2026 16:27  IST

విశాఖపట్నం జిల్లా గాజువాకలోని వికాస్ నగర్ వద్ద మే 3, 2026 ఆదివారం సాయంత్రం ఒక భవనం స్లాబ్ కుప్పకూలింది. రోడ్డు విస్తరణ కారణంగా కిందకు వెళ్ళిపోయిన ఒక పాత భవనాన్ని  హైడ్రాలిక్ జాకీల సహాయంతో పైకి లేపుతుండగా, ఒక్కసారిగా ఆ భవనం స్లాబ్ కూలిపోయింది.

ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు (35) అనే దినసరి కూలీ స్లాబ్ కింద నలిగి మృతి చెందాడు. సుమారు ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి, వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, నైపుణ్యం లేని కార్మికులతో జాకీలను ఆపరేట్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి