Breaking News

ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్‌ ప్రణాళిక


Published on: 21 May 2025 10:38  IST

ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్‌ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినట్లు సమాచారం. యూఎస్‌కు చెందిన అధికారులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇరాన్‌ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసే అవకాశం ఉందని ఇటీవల తమకు సమాచారం అందిందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి