Breaking News

నీటి సంపులో పడి సారా (13)అనే బాలిక మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 12, 2026న ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గోకుల్ ప్లాట్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సారా (13) అనే బాలిక ప్రమాదవశాత్తు నీటి సంపు (Sump)లో పడి మరణించింది.

Published on: 12 May 2026 14:33  IST

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 12, 2026న ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. గోకుల్ ప్లాట్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సారా (13) అనే బాలిక ప్రమాదవశాత్తు నీటి సంపు (Sump)లో పడి మరణించింది.

భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్, రేణుక దంపతులు మియాపూర్‌లో వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు.సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ ఆవరణలో ఆడుకుంటున్న బాలిక, మూత తీసి ఉన్న నీటి సంపులో అకస్మాత్తుగా పడిపోయింది.బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతకగా, చివరకు సంపులో అచేతనంగా పడి ఉండటం గమనించారు.వెంటనే ఆమెను నిజాంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక శరీరముపై గాయాలు ఉన్నాయని, ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు వ్యక్తం చేసినట్లు HMTV కథనం ద్వారా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి