Breaking News

బంగారం కొనొద్దన్న మోదీ పిలుపు వెనుక వ్యూహమేంటి?

బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి దేశ ఆర్థిక పరిస్థితులు, విదేశీ మారక నిల్వల పరిరక్షణతో ముడిపడి ఉందనే చర్చ జరుగుతోంది.


Published on: 12 May 2026 14:17  IST

ప్రధాని మోదీ ప్రజలకు చేసిన తాజా విజ్ఞప్తి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు సాధారణ సూచనలు కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసినవిగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో చమురు దిగుమతుల కోసం భారత్ భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో బంగారం దిగుమతులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పెడుతున్నాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో బంగారం వినియోగం అధికంగా ఉండటంతో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో దిగుమతులు జరుగుతున్నాయి. దీనివల్ల దేశం నుంచి డాలర్ల ప్రవాహం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే విదేశీ విహారయాత్రలు, ఇంధన వినియోగాన్ని కూడా తగ్గించాలని ప్రధాని సూచించారు. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా వినియోగించడం, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను పాటించడం ద్వారా ఇంధన ఖర్చులను నియంత్రించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఈ వ్యాఖ్యల ప్రభావం బంగారం మార్కెట్‌పైనా కనిపించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా జ్యువెలరీ రంగంలో డిమాండ్ తగ్గే అవకాశంపై చర్చ జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement