Breaking News

ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో అకాల మరణం

ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం (13 మే 2026) తెల్లవారుజామున గుండెపోటుతో అకాల మరణం చెందారు.


Published on: 13 May 2026 14:16  IST

ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) బుధవారం (13 మే 2026) తెల్లవారుజామున గుండెపోటుతో అకాల మరణం చెందారు.బుధవారం తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కుమారస్వామి లేఅవుట్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు ఆయనను బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.దిలీప్ రాజ్ కన్నడ చలనచిత్ర, బుల్లితెర రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2007లో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'మిలానా' (Milana) లో విలన్ పాత్ర పోషించి ఆయన అత్యంత ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత ప్రముఖ చిత్రం 'యు-టర్న్' (U-Turn), బాయ్‌ఫ్రెండ్ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

నటుడిగానే కాకుండా ఆయన దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. 'డీఆర్ క్రియేషన్స్' (DR Creations) బ్యానర్‌పై పలు విజయవంతమైన టీవీ సీరియళ్లను నిర్మించారు. జీ కన్నడలో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన 'హిట్లర్ కల్యాణ' (Hitler Kalyana) సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి