Breaking News

పాలకుర్తి ఇరిగేషన్ DE గంటి శ్రీకాంత్ అరెస్ట్

పాలకుర్తి (జనగామ జిల్లా పరిధి) ఇరిగేషన్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంటి శ్రీకాంత్ హన్మకొండలోని తన నివాసంలో ఒక కాంట్రాక్టర్ నుండి ₹50,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.


Published on: 25 May 2026 15:54  IST

పాలకుర్తి (జనగామ జిల్లా పరిధి) ఇరిగేషన్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE/DE) గంటి శ్రీకాంత్ హన్మకొండలోని తన నివాసంలో ఒక కాంట్రాక్టర్ నుండి ₹50,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

గంటి శ్రీకాంత్, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DE/EE), ఇరిగేషన్ శాఖ (I&CAD).పాలకుర్తి (జనగామ జిల్లా పరిధి) ₹50,000 నగదు.హన్మకొండ భవానీనగర్‌లోని ఆయన స్వగృహం.ఒక కాంట్రాక్టర్‌కు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి, అలాగే ఎంబీ రికార్డులలో తుది కొలతలను నమోదు చేయడానికి శ్రీకాంత్ ఈ లంచాన్ని డిమాండ్ చేశారు.లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించారు. దీంతో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు, రసాయనాలతో కూడిన లంచం సొమ్మును సదరు అధికారి తీసుకుంటుండగా రంగులతో సహా పట్టుకుని అరెస్ట్ చేశారు.నిందితుడైన గంటి శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని, వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి