Breaking News

తండ్రిమరణం తట్టుకోలేక తల్లి,కొడుకు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని లష్కర్‌గూడలో తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు, ఆపై కొడుకు మరణాన్ని భరించలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.


Published on: 28 May 2026 15:29  IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని లష్కర్గూడలో తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు, ఆపై కొడుకు మరణాన్ని భరించలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మృతులను పూసల కళావతి (45), పూసల శివకుమార్ శర్మ (20) గా పోలీసులు గుర్తించారు.

నేపథ్యం: వరంగల్‌కు చెందిన ఈ కుటుంబం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ పరిధిలోని కనకదుర్గానగర్ కాలనీలో నివసిస్తోంది. తల్లి కళావతి టైలరింగ్ పనులు చేస్తూ కుమారుడిని పోషిస్తోంది.

కుమారుడి ఆత్మహత్య: శివకుమార్ తండ్రి ఆరు నెలల క్రితం మరణించారు. తండ్రి లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన శివకుమార్ బుధవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తల్లి ఆత్మహత్య: కళ్లెదుటే కొడుకు శవమై కనిపించడంతో ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి కళావతి కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వెలుగులోకి వచ్చిందిలా: బుధవారం ఉదయం శివకుమార్ ఎంతకూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చి చూడగా, ఇద్దరూ మరణించి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అక్కడ శివకుమార్ రాసినట్లు భావిస్తున్న ఒక సూసైడ్ లేటర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో "మా నాన్న మరణించి రోజుకు ఆరు నెలలు అవుతోంది. నాన్న మరణించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన లేరన్న విషయాన్ని నేను జీर्णించుకోలేకపోతున్నాను. అందుకే మరణానికి సిద్ధపడ్డాను" అని రాసి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి