Breaking News

నెల్లూరులో ప్రైవేట్టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా

నెల్లూరు జాతీయ రహదారిపై గురువారం (28 మే 2026) ఉదయం ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 16 నుండి 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


Published on: 28 May 2026 17:05  IST

నెల్లూరు జాతీయ రహదారిపై గురువారం (28 మే 2026) ఉదయం ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 16 నుండి 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్డు (నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్) సమీపంలో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.ఈ బస్సు ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు గ్రామం నుండి తమిళనాడులోని వేళాంగిణి (నాగపట్నం) మాత చర్చికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే బస్సు హైవే రెయిలింగ్‌/ఫెన్సింగ్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 నుండి 45 మంది ప్రయాణికులు ఉన్నారు.

వీరిలో 39 మంది ఒకే గ్రూపునకు చెందిన బంధువులు కాగా, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు వంటవారు ఉన్నారు.గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.స్థానికుల సమాచారంతో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని నెల్లూరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానిక నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి