Breaking News

రాయదుర్గం భూములవేలంలో ఎకరం 237 కోట్లు

హైదరాబాద్‌లోని రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రికార్డు స్థాయిలో రూ. 237 కోట్లు పలికింది. ఈ రోజు (మే 28, 2026) తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIIC) నిర్వహించిన ప్రభుత్వ భూముల ఈ-వేలంలో ఈ సంచలన ధర నమోదైంది.


Published on: 28 May 2026 19:47  IST

హైదరాబాద్లోని రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రికార్డు స్థాయిలో రూ. 237 కోట్లు పలికింది. ఈ రోజు (మే 28, 2026) తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIIC) నిర్వహించిన ప్రభుత్వ భూముల ఈ-వేలంలో ఈ సంచలన ధర నమోదైంది.

శేరిలింగపల్లి మండలం పరిధిలోని రాయదుర్గం పాన్ మక్తా.సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమి.ప్రారంభ ధర ఎకరానికి కనీస ధరగా రూ. 139 కోట్లు నిర్ణయించగా, వేలంలో అది రూ. 237 కోట్లకు చేరింది.గతేడాది (అక్టోబర్ 2025) ఇదే ప్రాంతంలో ఎకరం రూ. 177 కోట్లు పలికింది. ఈసారి ఆ రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.ఈ భూమి హైటెక్ సిటీ - గచ్చిబౌలి మధ్యలో, క్వాల్‌కామ్ బిల్డింగ్, టీ-హబ్, టీ-వర్క్స్ వంటి ప్రముఖ ఐటీ హబ్‌లకు సమీపంలో ఉండటం వల్ల కార్పొరేట్ సంస్థలు మరియు డెవలపర్లు భారీ ధరలకు పోటీ పడ్డారు.ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ఒకే ప్లాట్ నుండి వందల కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

Follow us on , &

ఇవీ చదవండి