Breaking News

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026' ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు చోటు దక్కింది

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026' ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన యువతతో విడుదల చేసిన ఈ జాబితాలో మన తెలుగు కుర్రాళ్లు స్థానం సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి సత్తాను చాటారు.


Published on: 29 May 2026 12:59  IST

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026' ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన యువతతో విడుదల చేసిన ఈ జాబితాలో మన తెలుగు కుర్రాళ్లు స్థానం సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి సత్తాను చాటారు.

శివ గణేష్ గడ్డం

విభాగం: ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్  

సాధన: చిన్నారులకు, నేటి యువతకు ప్రాథమిక స్థాయి నుంచే సులభంగా అర్థమయ్యేలా కామిక్స్ (బొమ్మల కథలు) రూపంలో ఆర్థిక అక్షరాస్యతను నేర్పేందుకు శివ గణేష్ జెని5 (Geni5) అనే ఎడ్యుటెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు.

ప్రభావం: దీని ద్వారా పొదుపు, బడ్జెట్, పెట్టుబడులు, ఇన్సూరెన్స్, వ్యాపారవేత్తలుగా ఎదగడం వంటి డిజిటల్ యుగానికి సరిపడే మనీ మేనేజ్‌మెంట్ అంశాలను పిల్లలకు సులువుగా వివరిస్తున్నారు. ఇప్పటివరకు వీరి కామిక్స్ లక్ష మందికి పైగా చిన్నారులకు చేరువయ్యాయి.

2. మధులాష్ బాబు క్రొవ్విడి

విభాగం: సోషల్ ఇంపాక్ట్ / సామాజిక సేవా రంగం

సాధన: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు హైదరాబాద్ కేంద్రంగా 'ఎడోద్వజ ఫౌండేషన్' ను స్థాపించారు.

ప్రభావం: ల్యాబ్ సౌకర్యాలు లేని మారుమూల గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఒక టూర్ బస్సును సోలార్ పవర్‌తో నడిచే మొబైల్ ల్యాబ్‌గా మార్చి, దానికి 'FLOW' అని పేరు పెట్టారు. ఈ కదిలే ల్యాబ్ ద్వారా రోబోటిక్స్, ఏఐ (AI), 3D ప్రింటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను నేరుగా గ్రామీణ విద్యార్థుల వద్దకే తీసుకెళ్లారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60,000 మందికి పైగా గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా ఆధునిక సాంకేతిక విద్యను అందించారు.

ఆసియా వ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన 30 మంది యువ విజేతలలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువకులు నిలవడం తెలుగువారందరికీ గర్వకారణం.

Follow us on , &

ఇవీ చదవండి