Breaking News

చిట్‌ఫండ్‌ వేధింపులు తాళలేక AEO ఆత్మహత్య

నల్గొండ జిల్లాలో వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్‌ ఏజెంట్ల వేధింపులు తాళలేక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) గుంటోజు బాలరాజు (38) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విచారకరమైన ఘటన మే 27 బుధవారం రాత్రి చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది.


Published on: 29 May 2026 15:58  IST

నల్గొండ జిల్లాలో వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్‌ ఏజెంట్ల వేధింపులు తాళలేక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) గుంటోజు బాలరాజు (38) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విచారకరమైన ఘటన మే 27 బుధవారం రాత్రి చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది.

గుంటోజు బాలరాజు (38), నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (AEO)గా విధులను నిర్వహిస్తున్నారు. ఆయన స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల. ఆయనకు భార్య పద్మ, ఒక కుమారుడు (10), ఒక కుమార్తె (8) ఉన్నారు.

ఒక మిత్రుని మాటలు నమ్మి బాలరాజు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టారు. ఆ క్రమంలో జరిగిన నష్టాలు, అప్పులను తీర్చడానికి తోటి ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు, చిట్‌ఫండ్‌ ఏజెంట్ల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేశారు. సదరు వడ్డీ వ్యాపారులు బాలరాజు నుంచి ముందస్తుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని, గత కొన్ని రోజులుగా డబ్బుల కోసం ఆయనను, ఆయన భార్యను మానసికంగా తీవ్రంగా వేధించారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.బాలరాజు ఆత్మహత్యకు ముందు 9 పేజీల సూసైడ్ నోట్ రాశారు. అందులో తన బాధను ఎంతో ఆవేదనతో వివరించారు:

అప్పులు ఇచ్చిన వారి పేర్లు, వారి ఫోన్ నంబర్లు, ఎంత మొత్తంలో అప్పు తీసుకుంది, వారు ఎంత వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్నారనే వివరాలను నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.మృతుడి భార్య గుంటోజు పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement