Breaking News

ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ఎస్‌జే సూర్య నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'కిల్లర్' (Killer) సినిమా షూటింగ్ సెట్‌లో కార్బన్ డయాక్సైడ్ (గ్యాస్ బెలూన్) సిలిండర్ పేలి ఒకరు మృతి

ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ఎస్‌జే సూర్య నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'కిల్లర్' (Killer) సినిమా షూటింగ్ సెట్‌లో కార్బన్ డయాక్సైడ్ (గ్యాస్ బెలూన్) సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు.


Published on: 03 Jun 2026 17:57  IST

ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ఎస్జే సూర్య నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'కిల్లర్' (Killer) సినిమా షూటింగ్ సెట్‌లో కార్బన్ డయాక్సైడ్ (గ్యాస్ బెలూన్) సిలిండర్ పేలి ఒకరు మృతి చెందారు. జూన్ 3, 2026 బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని పెరంబూర్ పరిధిలో గల బిన్నీ మిల్స్  ప్రాంగణంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

మదురవాయల్‌కు చెందిన మదన్ (25 ఏళ్లు) అనే టెక్నీషియన్ (స్టంట్ మాన్) చికిత్స పొందుతూ మరణించాడు. దినకరన్, సూర్య, శరవణన్ (శక్తివేల్) అనే మరో ముగ్గురు చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఒక యాక్షన్ (బాంబు పేలుడు) సీక్వెన్స్ కోసం పెద్ద సిలిండర్ నుండి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ బదిలీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఓట్టేరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సెట్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి