Breaking News

'ధురంధర్' ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సాధించిన అసాధారణ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్ నిర్మించిన స్పేస్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సాధించిన అసాధారణ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు.


Published on: 04 Jun 2026 16:39  IST

బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్ నిర్మించిన స్పేస్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సాధించిన అసాధారణ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ ప్రశంసల జల్లు కురిపించారు. రిలయన్స్ షేర్ హోల్డర్లకు రాసిన వార్షిక నివేదిక లేఖలో ఆయన ఈ చిత్రం సాధించిన రికార్డులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రూ. 3,100 కోట్ల క్లబ్: 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3,100 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి.

40% భారత థియేట్రికల్ ఆదాయం: దేశవ్యాప్తంగా మొత్తం థియేట్రికల్ వసూళ్లలో ఈ ఒక్క ఫ్రాంచైజీనే దాదాపు 40 శాతం వాటాను సొంతం చేసుకోవడం గమనార్హం.

రూ. 350 కోట్ల బడ్జెట్: కేవలం రూ. 350 కోట్ల సంయుక్త బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలు ఈ స్థాయి లాభాలను తెచ్చిపెట్టడం తిరుగులేని విజయమని ఆయన కొనియాడారు.

వరుసగా 3 బ్లాక్‌బస్టర్లు: జియో స్టూడియోస్ వరుసగా మూడేళ్లపాటు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను అందించి అరుదైన రికార్డు సృష్టించిందని ముకేశ్ అంబానీ తెలిపారు.

చిత్రాల జాబితా: 2024లో 'స్త్రీ 2', 2025లో 'ధురంధర్', 2026లో 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జియో స్టూడియోస్ తిరుగులేని నాయకత్వాన్ని నిరూపించుకుందన్నారు.

తక్కువ వ్యవధిలో రెండు భాగాలు: ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకేసారి ప్లాన్ చేసి, షూటింగ్ పూర్తి చేసి, చాలా తక్కువ వ్యవధిలో రెండు భాగాలను విడుదల చేయడం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని ప్రశంసించారు.

15 వారాల రన్: మొదటి భాగం ఏకంగా 15 వారాల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవగా, ఆ తర్వాత వచ్చిన రెండో భాగం మొదటి సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పోషించిన 'జస్కీరత్', 'హంజా' పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి, ఈ సినిమాను ప్రతి ఇంటికీ చేర్చాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి