Breaking News

ఒమన్ దేశంలోని మినా అల్ ఫహల్ చమురు ఎగుమతి టర్మినల్‌కు సమీపంలో ఉన్న ఆఫ్‌షోర్ లోడింగ్ పాయింట్ల మధ్య పేలుడు సంభవించింది

ఒమన్‌లోని ప్రధాన 'మినా అల్ ఫహల్' (Mina al Fahal) చమురు టర్మినల్‌లో 2026 జూన్ 5న భారీ పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.


Published on: 05 Jun 2026 12:59  IST

ఒమన్‌లోని ప్రధాన 'మినా అల్ ఫహల్' (Mina al Fahal) చమురు టర్మినల్‌లో 2026 జూన్ 5న భారీ పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఒమన్ దేశంలోని మినా అల్ ఫహల్ చమురు ఎగుమతి టర్మినల్‌కు సమీపంలో ఉన్న ఆఫ్‌షోర్ లోడింగ్ పాయింట్ల మధ్య ఈ పేలుడు జరిగింది.అనుమానాస్పద డ్రోన్ దాడి వల్లే ఈ పేలుడు సంభవించిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.భద్రతా కారణాల దృష్ట్యా ఈ టర్మినల్ నుండి ముడి చమురును షిప్పులలోకి లోడింగ్ చేసే ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

చమురు వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం వల్ల లోడింగ్ పాయింట్‌లకు ఎలాంటి ప్రత్యక్ష నష్టం వాటిల్లలేదు. దాంతో కొన్ని గంటల వ్యవధిలోనే చమురు లోడింగ్ ప్రక్రియను అధికారులు మళ్లీ పునరుద్ధరించారు.మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అలాగే ఈ చమురు టర్మినల్‌పై జరిగిన దాడి ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement