Breaking News

పాక్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ


Published on: 22 May 2025 14:43  IST

మన భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన చూసిన తర్వాత తన రక్తం మరిగిపోయిందని చెప్పారు. ‘‘మేరా దిమాగ్ ఠండా రహతా.. లేకిన్ మేరా లహూ గరం రహతా’’ అని అన్నారు. అంటే తన మైండ్ కూల్ గా ఉన్నా.. తన రక్తం మరిగిపోతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రీ-డెవలప్ చేసిన103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్ బికనీర్ లో వర్చువల్ గా ప్రారంభించిన మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు.

Follow us on , &

ఇవీ చదవండి