Breaking News

మెటా సంస్థ తన ఫేస్‌బుక్ యూజర్ల కోసం మూడు సరికొత్త ఏఐ ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది

మెటా సంస్థ తన ఫేస్‌బుక్ యూజర్ల కోసం 15 జూన్ 2026న మూడు సరికొత్త ఏఐ ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫీచర్లు యూజర్లు సమాచారాన్ని వెతకడానికి, ఫోటోలు మరియు వీడియోలను క్రియేట్ చేయడానికి మరింత సులభంగా సహాయపడతాయి.


Published on: 17 Jun 2026 13:58  IST

మెటా సంస్థ తన ఫేస్‌బుక్ యూజర్ల కోసం 15 జూన్ 2026 మూడు సరికొత్త ఏఐ ఫీచర్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫీచర్లు యూజర్లు సమాచారాన్ని వెతకడానికి, ఫోటోలు మరియు వీడియోలను క్రియేట్ చేయడానికి మరింత సులభంగా సహాయపడతాయి.

మూడు సరికొత్త ఏఐ ఫీచర్లతో ఫేస్బుక్ వివరాలు:

ఏఐ మోడ్ - కొత్త సెర్చ్ ఫీచర్

ఫేస్‌బుక్ సెర్చ్ ట్యాబ్‌లో సరికొత్తగా AI Mode అనే ఆప్షన్‌ను తీసుకొచ్చారు.దీని ద్వారా మీరు ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు కేవలం వెబ్‌సైట్ లింకులు మాత్రమే కాకుండా, ఫేస్‌బుక్‌లోని పబ్లిక్ గ్రూపులు మరియు రీల్స్ లో ప్రజలు చర్చించుకునే నిజమైన అభిప్రాయాలు, సిఫార్సులను ఏఐ ఒకే చోట సారాంశంగా అందిస్తుంది.ఇది మ్యూస్ స్పార్క్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.

ఏఐ ఫోటో ఎడిటింగ్ ప్రిసెట్స్

మీ ఫోటోలలో మీ రూపాన్ని పూర్తిగా మార్చుకునేందుకు ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. యూజర్లు ఈ ఏఐ ప్రిసెట్స్ ద్వారా ఫోటోలలోని తమ దుస్తులు, హెయిర్‌స్టైల్స్ , మరియు యాక్సెసరీస్ వంటి వాటిని వర్చువల్‌గా మార్చి సరికొత్త స్టైల్‌లో ట్రై చేయవచ్చు.ముఖ్యంగా స్పోర్ట్స్ అభిమానులు స్టోరీస్ లో 'Wear It' అనే ఆప్షన్ ద్వారా తమకు నచ్చిన టీమ్ జెర్సీలను వర్చువల్‌గా ధరించి ఫోటోలను పోస్ట్ చేయవచ్చు.

కెమెరా రోల్ షేరింగ్ సజెషన్స్ & వీడియో మాంటేజ్

ఈ ఫీచర్ మీ ఫోన్ గ్యాలరీలోని ఫోటోలను ఏఐ సహాయంతో ఆటోమేటిక్‌గా విశ్లేషిస్తుంది.ఆ ఫోటోలను ఉపయోగించి అందమైన కొలేజ్ టెంప్లేట్స్ , ఆటోమేటెడ్ వీడియో మాంటేజ్‌లు మరియు అద్భుతమైన ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్‌తో షేర్ చేయడానికి రెడీగా ఉండేలా కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంది.ఈ ఫీచర్ పూర్తిగా మీ అనుమతి (Opt-in) తోనే పనిచేస్తుంది, మీకు వద్దు అనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎప్పుడైనా దీనిని బంద్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్లు ప్రస్తుతానికి అమెరికా వంటి కొన్ని దేశాల్లో అందుబాటులోకి రాగా, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా యూజర్లందరికీ రోల్ అవుట్ కానున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement