Breaking News

కోనసీమ జిల్లాలో యజమానిని చంపిన కూలీలు

కోనసీమ జిల్లా ఐ. పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేసే కూలీలు బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు.


Published on: 18 Jun 2026 11:30  IST

కోనసీమ జిల్లా . పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేసే కూలీలు బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు.

ఒడిశా ప్రాంతానికి చెందిన నలుగురు వలస కూలీలు. ఈ కూలీలు రామకృష్ణరాజుకు చెందిన రొయ్యల చెరువు వద్దే నివాసం ఉంటూ కాపలా కాస్తున్నారు.చెరువు పనుల విషయంలో రైతుకు, కూలీలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.గంజాయి మత్తులో ఉన్న కూలీలు రామకృష్ణరాజుపై బండరాయితో దాడి చేసి చంపేశారు. అనంతరం ఆధారాలు దాయడానికి అదే బండరాయిని ఆయన నడుముకు కట్టి మృతదేహాన్ని చెరువులో పడేశారు.

హత్య చేసిన తర్వాత నిందితులు అక్కడి నుండి పారిపోతుండగా, కాకినాడ సమీపంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐ. పోలవరం ఎస్సై రవీంద్రబాబు నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తను ప్రముఖ దినపత్రిక ప్రచురించింది.

Follow us on , &

ఇవీ చదవండి