Breaking News

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ (Advt No. 552) విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌ AIIMS బిలాస్‌పూర్ కార్యాలయంలో నియమించడానికి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.


Published on: 18 Jun 2026 18:57  IST

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ (Advt No. 552) విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్‌ AIIMS బిలాస్పూర్ కార్యాలయంలో నియమించడానికి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 జూన్ 2026.

ఖాళీల వివరాలు మరియు అర్హతలు

33 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యమైన పోస్టుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

బయోమెడికల్ ఇంజినీర్: 1 ఖాళీ. అర్హత: బీఈ/బీటెక్ లేదా డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం. జీతం: నెలకు ₹44,900.

ఓటీ టెక్నీషియన్: 2 ఖాళీలు. అర్హత: ఓటీ టెక్నిక్స్‌తో బీఎస్సీ లేదా ఇంటర్ మరియు ఓటీ టెక్నిక్స్‌లో డిప్లొమా. జీతం: నెలకు ₹35,400.

రేడియాలజీ టెక్నీషియన్: 1 ఖాళీ. అర్హత: రేడియోగ్రఫీలో బీఎస్సీ లేదా బీఎస్సీ రేడియోగ్రఫీ. జీతం: నెలకు ₹35,400.

ఇతర పోస్టులు: ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్, మరియు ఎంటిఎస్ .

ఎంపిక విధానం

అభ్యర్థుల విద్యార్హతలు మరియు అనుభవాన్ని బట్టి మొదట షార్ట్‌లిస్ట్ చేస్తారు.

అనంతరం ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము

జనరల్/OBC అభ్యర్థులకు: ₹295.

ఎస్సీ, ఎస్టీ, మరియు దివ్యాంగులకు : ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ

ఇది ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ. అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది.

 బెసిల్‌ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఫారమ్‌ను పూర్తిగా నింపి, మీ విద్యార్హత సర్టిఫికెట్ల నకళ్లను జతపరచండి.

దరఖాస్తును క్రింది చిరునామాకు 24 జూన్ 2026 లోపు చేరేలా పంపండి:

చిరునామా:
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బెసిల్‌),
బెసిల్‌ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62,
నోయిడా - 201307 (ఉత్తర ప్రదేశ్).

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement