Breaking News

సోమవారం తెల్లవారుజామున మాస్కో వైపు దూసుకొచ్చిన దాదాపు 59 డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు.

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడి కొనసాగుతోంది. జూన్ 22, 2026 సోమవారం తెల్లవారుజామున మాస్కో వైపు దూసుకొచ్చిన దాదాపు 59 డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు.


Published on: 22 Jun 2026 14:53  IST

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడి కొనసాగుతోంది. జూన్ 22, 2026 సోమవారం తెల్లవారుజామున మాస్కో వైపు దూసుకొచ్చిన దాదాపు 59 డ్రోన్లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఆక్రమిత ప్రాంతాలతో కలిపి మొత్తం 301 డ్రోన్లను రష్యా రాత్రికి రాత్రే అడ్డుకుంది.

విమానాశ్రయాల మూసివేత: డ్రోన్ల ముప్పు కారణంగా మాస్కోలోని ప్రముఖ విమానాశ్రయాలైన షెరెమెత్యేవో, డోమోడెడోవో, వ్నుకోవో, మరియు జుకోవ్‌స్కీలను తాత్కాలికంగా మూసివేసి విమాన సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత పరిస్ధితి అదుపులోకి రావడంతో ఎయిర్‌పోర్టులను తిరిగి తెరిచారు.

డ్రోన్ల అవశేషాలు పడిన ప్రాంతాల్లో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ తాజా దాడి వల్ల ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

'బ్లాక్ రెయిన్నేపథ్యం: అంతకుముందు జూన్ 18న ఉక్రెయిన్ దాదాపు 200 డ్రోన్లతో మాస్కోలోని ప్రధాన కపోత్న్యా ఆయిల్ రిఫైనరీ పై దాడి చేసింది. రిఫైనరీ తగలబడి ఆకాశమంతా నల్లటి పొగ అలుముకుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో కురిసిన వర్షంలో చమురు కణాలు కలిసి వాహనాలు, బట్టలపై నల్లటి మచ్చలుగా పడటంతో ప్రజలు దానిని 'బ్లాక్ రెయిన్' గా అభివర్ణించారు.ఈ తాజా జూన్ 22 దాడి కూడా ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా గత వారం జరిగిన దాడుల కొనసాగింపుగానే రక్షణ నిపుణులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి