Breaking News

నాంపల్లి కోర్టుకు హాజరుకానీ హీరో అల్లు అర్జున్

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు (22 జూన్ 2026) నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు.


Published on: 22 Jun 2026 16:48  IST

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు (22 జూన్ 2026) నాంపల్లి కోర్టుకు హీరో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. ముంబైలో జరుగుతున్న సినిమా షూటింగ్ వల్ల తాను రాలేకపోతున్నానని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలియజేస్తూ 'ఆబ్సెంట్ పిటిషన్' దాఖలు చేశారు.

అల్లు అర్జున్ హాజరు కాకపోవడంతో, నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 6, 2026కు వాయిదా వేసింది.అల్లు అర్జున్ కోర్టుకు ఎందుకు రాలేకపోయారో స్పష్టమైన కారణాలతో కూడిన 'మెమో' దాఖలు చేయాలని ఆయన లాయర్లను న్యాయమూర్తి ఆదేశించారు.ఈ కేసులో ఉన్న మిగతా 21 మంది నిందితులు కోర్టుకు హాజరై బాండ్లపై సంతకాలు చేశారు.

2024 డిసెంబర్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో/ప్రమోషన్స్ సమయంలో భారీగా జనసందోహం పెరిగి తొక్కిసలాట జరిగింది.ఈ ప్రమాదంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు అల్లు అర్జున్‌ను A11 (11 నిందితుడిగా) చేరుస్తూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందుకే జూన్ 22న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ గతంలో సమన్లు జారీ అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి