Breaking News

ఖతార్‌లోని రస్‌ లఫాన్‌ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది మృతి , వారిలో 12 మంది భారతీయులు ఉన్నారు

ఖతార్‌లోని రస్‌ లఫాన్‌ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది మరణించారు, వారిలో 12 మంది భారతీయులు ఉన్నారు.ఆదివారం (జూన్ 21, 2026) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.


Published on: 23 Jun 2026 10:53  IST

ఖతార్లోని రస్లఫాన్గ్యాస్ ఎగుమతి కేంద్రంలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది మరణించారు, వారిలో 12 మంది భారతీయులు ఉన్నారు.ఆదివారం (జూన్ 21, 2026) రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరో 66 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

దోహాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రస్‌ లఫాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని 'బార్జాన్ గ్యాస్ ప్లాంట్' లో ఈ ప్రమాదం జరిగింది.గ్యాస్ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే క్రమంలో జరిగిన ఒక సాంకేతిక లోపం వల్ల ఈ భారీ పేలుడు సంభవించినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

గత మార్చి నెలలో ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా ఈ ప్లాంట్ దెబ్బతినడంతో ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటీవల పరిస్థితులు సద్దుమణగడంతో తిరిగి పనులు ప్రారంభించేందుకు కార్మికులు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ సమాచారం ప్రకారం, మొత్తం 13 మంది మరణించగా, అందులో 12 మంది భారతీయ పౌరులు, ఒకరు పాకిస్థాన్ జాతీయుడు ఉన్నారు.ఈ ప్రమాదంలో 66 మంది గాయపడగా, వారిలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కెన్యా వంటి పలు దేశాలకు చెందిన కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరికీ స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

పేలుడు తర్వాత భారీగా మంటలు చెలరేగినప్పటికీ, సహాయక బృందాలు వాటిని అదుపులోకి తెచ్చాయి. ప్రమాదకరం గ్యాస్ లీకేజీ ఏదీ లేదని, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement