Breaking News

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్‌ను నటి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్‌ను నటి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం, ఆయన పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా ఎలాంటి శుభాకాంక్షలు తెలపకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.


Published on: 23 Jun 2026 12:56  IST

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్ను నటి త్రిష ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయడం, ఆయన పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా ఎలాంటి శుభాకాంక్షలు తెలపకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ప్రతి సంవత్సరం విజయ్ పుట్టినరోజున అందరికంటే ముందుగా స్పందిస్తూ, ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపే త్రిష... ఈ ఏడాది జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. విజయ్ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి బర్త్‌డే కావడంతో ఈ సైలెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో

బర్త్‌డే రోజున మౌనంగా ఉండటమే కాకుండా, తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ బంధానికి లేదా రిలేషన్‌షిప్‌నకు బ్రేక్ పడిందనే వార్తలు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా ప్రచారమవుతున్నాయి.

ప్రచారంలో ఉన్న ముఖ్య కారణాలు

విజయ్-సంగీత ప్యాచ్ అప్: గతంలో విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నారని, ఆ తర్వాత త్రిషను వివాహం చేసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇటీవల విజయ్ తన భార్య సంగీతతో మనస్పర్థలను వీడి మళ్లీ కలిసిపోయారని వార్తలు వస్తున్నాయి. విజయ్ తన ఫ్యామిలీ లైఫ్‌ను సెట్ చేసుకోవడం వల్లే త్రిష ఆయనకు పూర్తిగా దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెన్నై మీడియా వర్గాల సమాచారం.

రాజకీయ భవిష్యత్తు: విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో, ఆయన రాజకీయ భవిష్యత్తును మరియు కుటుంబ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని పెద్దలు నచ్చజెప్పడంతో ఈ మార్పు వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ వివాదంపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది త్రిష మొదటి నుంచీ విజయ్‌ను ఫాలో చేయడం లేదని, కావాలనే కొందరు బ్రేకప్ రూమర్లను సృష్టిస్తున్నారని వాదిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి