Breaking News

దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం

అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో 23 జూన్ 2026 మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.


Published on: 23 Jun 2026 15:31  IST

అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో 23 జూన్ 2026 మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పైరోలిసిస్ ఆయిల్ తయారు చేసే ఈ కంపెనీలో ఒక ట్యాంక్/రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులను అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వీపడ వెంకటేష్ (ఆపరేటర్), శ్రీనాథ్ (మెకానికల్ ఫిట్టర్)గా పోలీసులు గుర్తించారు.మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో, నైట్ డ్యూటీలో కార్మికులు ఉన్నప్పుడు ఈ పేలుడు సంభవించింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫార్మాసిటీ మరియు పరవాడ ఫైర్ స్టేషన్ల నుండి అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దట్టమైన పొగలు మరియు మంటలు ఎగసిపడటంతో స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

సీఎం నారా చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

హోం మంత్రి వంగలపూడి అనిత: హోం మంత్రి అనిత అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతిని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి