Breaking News

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్ట్ 3, 2026 వరకు పొడిగించింది

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆగస్ట్ 3, 2026 వరకు పొడిగించింది. రాజకీయ పార్టీల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం, ఈ రోజు (15 జూలై 2026) ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సవరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: 15 Jul 2026 19:45  IST

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆగస్ట్ 3, 2026 వరకు పొడిగించింది. రాజకీయ పార్టీల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం, ఈ రోజు (15 జూలై 2026) ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సవరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

బీఎల్ఓ (BLO) ఇంటింటి సర్వే గడువు: బూత్ స్థాయి అధికారులు (BLO) ఇళ్ల వద్దకు వచ్చి ఓటర్ల వివరాల నమోదు, ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే గడువును మునుపటి జూలై 24 నుండి ఆగస్ట్ 3, 2026 వరకు పొడిగించారు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ: పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేయడానికి కూడా ఆగస్ట్ 3, 2026 వరకు సమయం ఇచ్చారు.

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ : ఇది ఆగస్ట్ 10, 2026 న విడుదల కానుంది.

క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా కొత్త ఓటు నమోదు దరఖాస్తులను ఆగస్ట్ 10 నుండి సెప్టెంబర్ 9, 2026 వరకు సమర్పించవచ్చు.

అభ్యంతరాల పరిష్కారం: వచ్చిన అభ్యంతరాలపై విచారణ మరియు పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 10, 2026 లోపు పూర్తి చేస్తారు.

తుది ఓటర్ల జాబితా విడుదల (Final Voter List): అన్ని సవరణల తర్వాత ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 12, 2026 న అధికారికంగా ప్రచురిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement