Breaking News

హైదరాబాద్ కంపెనీ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవినాశ్‌ (40) ఆత్మహత్య

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది; తాను పనిచేస్తున్న కంపెనీ భవనం నాలుగో అంతస్తు (ప్లే ఏరియా) నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవినాశ్‌ (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘోర ఘటన గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.


Published on: 16 Jul 2026 10:34  IST

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది; తాను పనిచేస్తున్న కంపెనీ భవనం నాలుగో అంతస్తు (ప్లే ఏరియా) నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవినాశ్‌ (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘోర ఘటన గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన తిరువీధి వి.అవినాశ్‌ (40) గా గుర్తించారు.బెంగళూరులో ఉద్యోగం చేసిన అవినాష్, రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు. భార్య జ్యోతి, ఇద్దరు కుమారులతో కలిసి కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు.హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని క్వాల్‌కామ్ భవనంలో ఉన్న హెచ్‌సీఎల్‌ (HCL) కంపెనీలో ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

విధులు ముగించుకుని 6 గంటల ప్రాంతంలో "ఇంటికి వస్తున్నాను" అని అవినాష్ తన భార్యకు మెసేజ్ పంపారు.రాత్రి అయినా ఆయన ఇంటికి రాకపోవడం, తన వద్ద ఉన్న రెండు ఫోన్లలో ఒకటి స్విచ్చాఫ్ రావడం, మరొకటి లిఫ్ట్ చేయకపోవడంతో భార్య ఆందోళన చెంది ఆఫీస్ మేనేజర్‌కు సమాచారం అందించారు.అదే రోజు రాత్రి 8:30 గంటల సమయంలో ఆఫీస్ వెనుక భాగానికి వెళ్లి చూడగా అవినాష్ రక్తపు మడుగులో శవమై కనిపించారు.ఆఫీస్ పని ముగిసిన తర్వాత ఆయన నాలుగో అంతస్తులోని ప్లే ఏరియా (Play Area) నుండి కిందికి దూకినట్లు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది.

ఆత్మహత్యకు గల కారణాలు

పోలీస్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, అవినాష్ ఇటీవల సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో పడి రూ. 2 లక్షలు పోగొట్టుకున్నారు. ఆన్లైన్ మోసం వల్ల డబ్బులు పోవడంతో తీవ్ర మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి గురై ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి