Breaking News

10కోట్ల విలువైన బంగారు ఆభరణాల సీజ్

వరంగల్‌లో రూ.10 కోట్ల విలువైన సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు సీజ్ చేశారు. నగరంలోని పలు బంగారు ఆభరణాల దుకాణాల్లో BIS అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఈ భారీ మోసం వెలుగుచూసింది.


Published on: 21 Jul 2026 17:36  IST

వరంగల్లో రూ.10 కోట్ల విలువైన సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు సీజ్ చేశారు. నగరంలోని పలు బంగారు ఆభరణాల దుకాణాల్లో BIS అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఈ భారీ మోసం వెలుగుచూసింది.

సీజ్ చేసిన బంగారం బరువు సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలు.ఆభరణాల విలువ మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 10 కోట్లు.సదరు బంగారు దుకాణాలలో హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ (HUID) లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఆభరణాలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రజల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదుల ఆధారంగానే ఈ తనిఖీలు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని BIS అధికారులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement