Breaking News

హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ సంస్థ రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ నిధుల సమీకరణ రౌండ్‌లో $40 మిలియన్లు సేకరించినట్లు అధికారికంగా ప్రకటించింది.

హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ సంస్థ రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ (RVAG), తమ తాజా నిధుల సమీకరణ రౌండ్‌లో $40 మిలియన్లు సేకరించినట్లు అధికారికంగా ప్రకటించింది.


Published on: 21 Jul 2026 19:51  IST

హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ సంస్థ రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ (RVAG), తమ తాజా నిధుల సమీకరణ రౌండ్‌లో $40 మిలియన్లు సేకరించినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఫండింగ్ రౌండ్‌కు నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్ మరియు స్కెజెన్ అసెట్ మేనేజ్‌మెంట్ సంయుక్తంగా నాయకత్వం వహించాయి. వీటితో పాటు ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్, GJNX వెంచర్స్ మరియు ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కూడా ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఈ 400 కోట్ల రూపాయల నిధులను భారత్, యూకే (UK), యూఎస్ఏ (USA) లలో ఉన్న తమ తయారీ కేంద్రాల విస్తరణకు ఉపయోగించనున్నారు. అలాగే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హార్డ్‌వేర్ పార్క్‌లో నిర్మిస్తున్న సమగ్ర ఏరోస్పేస్ & డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్యాంపస్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి, డీప్-టెక్, స్వయంప్రతిపత్తి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు.

రఘు వంశీ ఏరోస్పేస్ సంస్థకు ప్రస్తుతం రూ. 2,500 కోట్లకు పైగా ఆర్డర్ బుక్ ఉంది. ఈ సంస్థ జీఈ ఏరోస్పేస్ , హనీవెల్, సాఫ్రాన్, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తోంది.ఈ పెట్టుబడి ద్వారా తమ సాంకేతికతను, ఉద్యోగుల నైపుణ్యాలను మరియు అంతర్జాతీయ రక్షణ రంగ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత పెంచుకోనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement