Breaking News

విమానాశ్రయంలో తుపాకీ తూటా కలకలం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో ఒక ప్రయాణికుడి బ్యాగులో తుపాకీ తూటా (బుల్లెట్) లభించడం తీవ్ర కలకలం రేపింది


Published on: 23 Jul 2026 18:31  IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో ఒక ప్రయాణికుడి బ్యాగులో తుపాకీ తూటా (బుల్లెట్) లభించడం తీవ్ర కలకలం రేపింది.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆనంద్‌ కుమార్‌ యాదవ్‌ అనే కానిస్టేబుల్ తన సోదరుడి అమరావతి విట్‌ విశ్వవిద్యాలయం ఇంటర్వ్యూ కోసం విజయవాడకు వచ్చారు.ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత అతను ఎయిర్‌ ఇండియా విమానంలో దిల్లీ వెళ్లేందుకు విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఎయిర్‌పోర్టులో బోర్డింగ్‌ పాస్ భద్రతా తనిఖీలు చేస్తున్న సమయంలో, అతని బ్యాగులో లైవ్ తుపాకీ తూటా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అప్రమత్తమైన విమానయాన సంస్థ ప్రతినిధులు వెంటనే అతడిని గన్నవరం రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అతను పొరపాటున తన కుటుంబ సభ్యులలోని ఒక లైసెన్స్‌డ్ తుపాకీ కలిగిన వ్యక్తి బ్యాగును ప్రయాణానికి తీసుకువచ్చినట్లు తేలింది.సదరు తుపాకీ లైసెన్స్‌ను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెప్పించి వెరిఫై చేసిన అనంతరం, పోలీసులు ఆ ప్రయాణికుడిని అక్కడి నుంచి పంపించివేశారు.

 

Follow us on , &

ఇవీ చదవండి