Breaking News

అమెరికాలో సాఫ్ట్‌వేర్ఇంజనీర్ దీపారెడ్డి మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీపాతి దీపారెడ్డి (44) మరణించారు.శ్రీపాతి దీపారెడ్డి (44). ఈమె రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలం, ఆకుతోటపల్లి గ్రామానికి చెందినవారు


Published on: 28 Jul 2026 15:18  IST

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీపాతి దీపారెడ్డి (44) మరణించారు.శ్రీపాతి దీపారెడ్డి (44). ఈమె రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలం, ఆకుతోటపల్లి గ్రామానికి చెందినవారు.మాడుగుల మండలానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి, 20 ఏళ్ల క్రితం ఆకుతోటపల్లికి చెందిన రామకృష్ణారెడ్డితో వివాహమైంది.

దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.దీపారెడ్డి తన కారులో వెళ్తూ న్యూజెర్సీలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఆమె కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement