Breaking News

ఆదర్శ రైతులకు.. అరుదైన గౌరవం

నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు లోకసాని పద్మారెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.


Published on: 29 Jul 2026 16:17  IST

నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సేంద్రియ రైతు లోకసాని పద్మారెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.భారత వ్యవసాయ పరిశోధనా మండలి పరిధిలోని సెంట్రల్ సిట్రస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ , నాగపూర్ తన 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిమ్మజాతి పంటల సాగులో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ ఘన సన్మానాన్ని అందజేసింది.

పద్మారెడ్డి వ్యవసాయ ప్రస్థానంప్రత్యేకతలు

కుంకుడు సాగులో గుర్తింపు: నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఈయన, తన 12 ఎకరాల క్షేత్రంలో కుంకుడు పంటను సాగు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

సేంద్రియ విధానం: గత 25 ఏళ్లుగా పూర్తిగా గోఆధారిత సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు.

సిట్రస్ (బత్తాయి) తోటలు: ఆయన క్షేత్రంలో సుమారు 40 ఏళ్ల నాటి బత్తాయి తోట ఉండటంతో పాటు, విభిన్న రకాల నిమ్మజాతి పంటలను విజయవంతంగా సాగు చేస్తున్నారు.

జామ, కొబ్బరి, ఉసిరి, మామిడి వంటి తోటలను కూడా సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు.

విలువ ఆధారిత ఉత్పత్తులు: అటవీ పంట అయిన కుంకుడు నుంచి విలువ ఆధారిత వస్తువులను తయారు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.

సన్మాన కార్యక్రమం

మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఐకార్ కేంద్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ శరత్, గడఖ్‌లతో పాటు ఐసీఏఆర్, సీఐసీఆర్ డైరెక్టర్లు డాక్టర్ ఎన్. జి. పాటిల్, డాక్టర్ దిలీప్ బోస్ చేతుల మీదుగా పద్మారెడ్డికి ఈ గౌరవ సత్కారం లభించింది.

Follow us on , &

ఇవీ చదవండి