Breaking News

అదానీ గ్రూప్ బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద ఓడరేవుల ఆపరేటర్ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి భారీ బిడ్‌ దాఖలు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ), బ్రిటన్‌లోని అత్యంత పెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ABP) ను కొనుగోలు చేయడానికి భారీ బిడ్‌ దాఖలు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.


Published on: 30 Jul 2026 12:17  IST

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ), బ్రిటన్‌లోని అత్యంత పెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ABP) ను కొనుగోలు చేయడానికి భారీ బిడ్‌ దాఖలు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించాలనే వ్యూహంలో భాగంగా అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ ఆర్థిక జర్నల్స్ వెల్లడించాయి.

డీల్ విలువ మరియు వాటా

రూ. 1 లక్ష కోట్ల భారీ డీల్: ఈ కొనుగోలు విలువ దాదాపు 10 బిలియన్ పౌండ్లు పైమాటే ఉంటుందని అంచనా.

63.9% నియంత్రణ వాటా: కెనడాకు చెందిన రెండు పెద్ద పెన్షన్ ఫండ్లు తాము కలిగి ఉన్న 63.9% నియంత్రణ వాటాను విక్రయించడానికి సిద్ధమవడంతో, అదానీ గ్రూప్ దీనిపై కన్నేసింది.

అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ప్రత్యేకతలు

21 ఓడరేవుల నెట్‌వర్క్: ఈ సంస్థ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న 21 కీలకమైన ఓడరేవులను నిర్వహిస్తోంది.

25% సముద్ర వ్యాపారం: బ్రిటన్ మొత్తంలో జరిగే సముద్ర వాణిజ్యంలో పావు వంతు (25%) వ్యాపారాన్ని ఒంటరిగానే ఈ సంస్థ హ్యాండిల్ చేస్తోంది. ఇందులో యూకేలోనే అతిపెద్దదైన 'ఇమింఘమ్' మరియు 'సౌతాంప్టన్' రేవులు ఉన్నాయి.

అదానీ అంతర్జాతీయ లక్ష్యాలు

గ్లోబల్ లీడర్ ప్రణాళిక: 2031 నాటికి అదానీ పోర్ట్స్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా ఉటిలిటీ సంస్థగా మార్చాలని గౌతమ్ అదానీ లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే ఉన్న విదేశీ పోర్టులు: ప్రస్తుతం అదానీ గ్రూప్‌నకు ఇజ్రాయెల్ (హైఫా పోర్ట్), శ్రీలంక, టాంజానియా, ఆస్ట్రేలియా దేశాలలో అంతర్జాతీయ పోర్టులు ఉన్నాయి. బ్రిటన్‌ ప్రాజెక్ట్ గనుక ఓకే అయితే, ఇది ఒక జీ7 (G7) దేశంలో అదానీ గ్రూప్ సాధించే అతిపెద్ద మౌలిక సదుపాయాల విజయం అవుతుంది

ప్రస్తుత స్థితి మరియు కంపెనీ వివరణ

ప్రాథమిక దశలో చర్చలు: ఈ కొనుగోలు ప్రక్రియ ఇంకా చాలా ప్రాథమిక దశలోనే ఉంది. ఈ చర్చలపై అధికారికంగా స్పందించిన అదానీ పోర్ట్స్ ప్రతినిధి, తాము మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని, అయితే సంస్థ దీర్ఘకాలిక వ్యూహాలకు సరిపోయే అవకాశాలను నిరంతరం పరిశీలిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి