Breaking News

నారపల్లిలో 980 కిలోల కల్తీ పనీర్ స్వాధీనం

హైదరాబాద్ నారపల్లిలో ఎలాంటి లేబుళ్లు, గడువు తేదీలు లేని 980 కిలోల కల్తీ పనీర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ , మేడిపల్లి పోలీసులు మరియు ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ-1 బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ కల్తీ పనీర్ దందా వెలుగుచూసింది.


Published on: 30 Jul 2026 19:48  IST

హైదరాబాద్ నారపల్లిలో ఎలాంటి లేబుళ్లు, గడువు తేదీలు లేని 980 కిలోల కల్తీ పనీర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ , మేడిపల్లి పోలీసులు మరియు ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ-1 బృందం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ భారీ కల్తీ పనీర్ దందా వెలుగుచూసింది.పోచారం డివిజన్, నారపల్లిలోని భాగ్యనగర్ నందనవనం పార్కు సమీపంలో మెయిన్ రోడ్డుపై పోలీసులు నిఘా పెట్టారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు: అనుమానాస్పదంగా వచ్చిన రెండు మహీంద్రా స్కార్పియో వాహనాలను ఆపి తనిఖీ చేయగా, వాటిలో తరలిస్తున్న 980 కిలోల పనీర్ దొరికింది. వీటితో పాటు రెండు ఫోన్లు, రెండు ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

తయారీ కేంద్రాలు: జనగామ జిల్లాలోని పెంబర్తి, పోచన్నపేట గ్రామాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు (లైసెన్స్) లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఈ పనీర్‌ను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

నిందితుల అరెస్ట్: పెంబర్తికి చెందిన చామకూరి రాంరెడ్డి, పోచన్నపేటకు చెందిన జూల శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి