Breaking News

ఆస్తి పన్ను..ఏటా 20 శాతం పెంపు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుత వార్షిక అద్దె విలువ (ARV) విధానానికి స్వస్తి పలికి, భూ విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం వల్ల పన్ను ఒకేసారి భారీగా పెరగకుండా, ఏటా గరిష్ఠంగా 20 శాతం మాత్రమే పెరిగేలా చట్ట సవరణ చేయనున్నారు.


Published on: 31 Jul 2026 17:37  IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుత వార్షిక అద్దె విలువ (ARV) విధానానికి స్వస్తి పలికి, భూ విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం వల్ల పన్ను ఒకేసారి భారీగా పెరగకుండా, ఏటా గరిష్ఠంగా 20 శాతం మాత్రమే పెరిగేలా చట్ట సవరణ చేయనున్నారు.ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది.

కీలక ముఖ్యాంశాలు:

భూ విలువే ప్రామాణికం: రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించే మార్కెట్ ధర/భూ విలువ ఆధారంగా ఇకపై ఆస్తి పన్ను లెక్కిస్తారు.

ఇళ్లకు సంబంధించి ఆస్తి విలువపై 0.10% నుంచి 0.50% వరకు పన్ను విధించాలని ప్రతిపాదించారు

కమర్షియల్ ఆస్తుల పన్ను స్లాబ్‌లు: వ్యాపార, వాణిజ్య సముదాయాలకు ఆస్తి విలువపై 0.20% నుంచి గరిష్టంగా 2.00% వరకు పన్ను స్లాబ్‌లు ఉండనున్నాయి.

క్రమబద్ధమైన పెంపు: మార్కెట్ విలువ ప్రకారం పన్ను 100 నుండి 200 శాతం పెరిగినా, ప్రజలపై ఒకేసారి భారం పడకుండా ఏడాదికి గరిష్ఠంగా 20 శాతం మాత్రమే ఆటోమేటిక్‌గా పెరిగేలా నిబంధన తెస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో తగ్గనున్న పన్ను: భూ విలువలపై 0.15 శాతం పన్ను విధానాన్ని వర్తింపజేయడం వల్ల నగరంలోని కొన్ని సర్కిళ్ల పరిధిలో నివాస భవనాలకు పన్ను తగ్గే అవకాశం కూడా ఉందని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి.

పౌరుల నుంచి వ్యతిరేకత

ఈ కొత్త ముసాయిదా చట్టం పై పౌర సమాజం మరియు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నామమాత్రపు పౌర సదుపాయాలు కూడా కల్పించకుండా ఏటా 20 శాతం పన్ను పెంచడం మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపడమేనని, ఇది అద్దెలు పెరగడానికి కూడా దారితీస్తుందని నిరసనలు వ్యక్తంచేస్తూ జీహెచ్‌ఎంసీకి 3,000 పైగా ఫిర్యాదులు అందాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement