Breaking News

కాసుల వర్షం కురిపిస్తున్నమహిళ కష్టం

తెలంగాణలోని కమలాపూర్‌ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన దుబ్బాక ప్రమీల అనే మహిళ, తన చేతి వంటతో (గారెలు) సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా, ఆర్థికంగా ఎలా స్థిరపడ్డారో ఈ కథనంలో వివరించారు.


Published on: 03 Aug 2026 17:39  IST

తెలంగాణలోని కమలాపూర్మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన దుబ్బాక ప్రమీల అనే మహిళ, తన చేతి వంటతో (గారెలు) సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా, ఆర్థికంగా ఎలా స్థిరపడ్డారో ఈ కథనంలో వివరించారు.కమలాపూర్‌-ఇల్లందకుంట మార్గంలోని వంగపల్లి గ్రామం .ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది.కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల నుండి రాకపోకలు సాగించే ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు, కార్లలో వెళ్లేవారు ఇక్కడ ఆగి మరి గారెలు తింటారు.

కాసుల వర్షం కురిపిస్తున్న కష్టం

ప్రమీలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 30 ఏళ్లుగా ఈ వ్యాపారమే వారికి ఉపాధి. 15 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించినా అధైర్యపడకుండా ఒంటరిగానే వ్యాపారాన్ని ముందుకు నడిపించారు.ఈ గారెల వ్యాపారంతోనే ఆమె తన నలుగురు పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేశారు మరియు సొంతంగా ఒక ఇల్లు కూడా నిర్మించుకున్నారు.

వ్యాపార వివరాలు ,ఆదాయం

ప్రతిరోజూ 12 నుండి 13 కిలోల మిశ్రమాన్ని (పప్పు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మసాలాలు) గ్రైండర్‌లో వేసి పిండిగా రుబ్బుతారు. వీటిని సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యిపై రుచికరంగా తయారు చేస్తారు.

రోజువారీ ఖర్చులు: సుమారు రూ. 2,000 పెట్టుబడి అవుతుంది.

రోజువారీ ఆదాయం: రోజుకు రూ. 4,000 నుండి రూ. 4,500 వరకు వ్యాపారం జరుగుతుంది.

నికర లాభం: ఖర్చులు పోను రోజుకు రూ. 2,000 వరకు నికర లాభం (మిగులు) ఉంటుంది.

 

Follow us on , &

ఇవీ చదవండి