Breaking News

స్మార్ట్ రషన్సార్డ్ కు 9 రకాల రక్షణ

తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు నకిలీలకు చెక్ పెట్టేలా, అత్యంత సురక్షితమైన 9 రకాల హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించబడ్డాయి. కరెన్సీ నోట్లు, పాస్‌పోర్టుల తయారీలో వాడే అత్యాధునిక సాంకేతికతను ఈ కార్డుల డిజైన్‌లో ఉపయోగించారు.


Published on: 14 Aug 2026 14:33  IST

తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు నకిలీలకు చెక్ పెట్టేలా, అత్యంత సురక్షితమైన 9 రకాల హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించబడ్డాయి. కరెన్సీ నోట్లు, పాస్‌పోర్టుల తయారీలో వాడే అత్యాధునిక సాంకేతికతను ఈ కార్డుల డిజైన్‌లో ఉపయోగించారు.

రిలీఫ్ టెక్స్ట్ : కార్డుపై 'గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అని అక్షరాలు పైకి ఉబ్బినట్లు ఉంటాయి. దీనిని చేతితో తాకి (స్పర్శ ద్వారా) అసలైనదో కాదో సులభంగా గుర్తించవచ్చు.

సెక్యూర్ హోలోగ్రామ్: కార్డు వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన ప్రత్యేకమైన హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు.

అతి సూక్ష్మ అక్షరాలు : సాధారణ కంటికి నేరుగా కనిపించని రీతిలో అత్యంత చిన్న సైజులో టెక్స్ట్ ముద్రించబడి ఉంటుంది. దీనిని కేవలం భూతద్దం సహాయంతోనే చూడగలరు.

డ్యూయల్ హిడెన్ ఇమేజ్ : కార్డును ఒక నిర్దిష్ట కోణంలో తిప్పి చూసినప్పుడు మాత్రమే 'Go TG', 'ORIGINAL' వంటి రహస్య గుర్తులు కనిపిస్తాయి.

వాటర్‌మార్క్: కార్డును వెలుతురుకు లేదా కాంతికి ఎదురుగా పట్టుకుని చూసినప్పుడు లోపల ప్రభుత్వ అధికారిక చిహ్నం వాటర్‌మార్క్‌లా స్పష్టంగా కనిపిస్తుంది.

అదృశ్య యూవీ లోగో : సాధారణంగా కనబడని ఈ లోగో, కేవలం ఆల్ట్రావైలెట్ లైట్ కింద ఉంచినప్పుడు మాత్రమే మెరుస్తూ కనిపిస్తుంది.

ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ : కార్డుపై ఉండే ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే లబ్ధిదారుల పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం డిజిటల్ స్క్రీన్‌పై తక్షణమే ప్రత్యక్షమవుతాయి.

గిలోష్ నమూనా : నకిలీ ప్రింటింగ్ లేదా కలర్ జిరాక్స్ తీయడానికి వీలుపడకుండా ఉండేలా సంక్లిష్టమైన అలల లాంటి సెక్యూరిటీ డిజైన్ కార్డుపై ఉంటుంది.

అధికారిక కమిషనర్ సంతకం: కార్డు ముందు భాగం క్రింది వైపు పౌరసరఫరాల శాఖ కమిషనర్ యొక్క అధికారిక డిజిటల్ సంతకం ముద్రించి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి