Breaking News

గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యం

సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సుమారు 23 రోజుల తర్వాత వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published on: 26 Aug 2026 18:58  IST

సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సుమారు 23 రోజుల తర్వాత వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గల్లంతైన ప్రాంతం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుండి ఈ నెల (ఆగస్టు) 3వ తేదీన వీరంతా బోటులో వేటకు వెళ్లారు.

ఒడిశాలోని పారాదీప్ - పశ్చిమ బెంగాల్ సరిహద్దు జలాల్లో వీరు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది.

గాలింపు చర్యలు: మత్స్యకారులు కనిపించకుండా పోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ నౌకలు, హెలికాప్టర్లతో గత కొన్ని రోజులుగా సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బోటులో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే వారు కొట్టుకుపోయినట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం మత్స్యకారులంతా సురక్షితంగా ఉన్నారని తెలియడంతో వారిని తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి