Breaking News

కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై కర్నాటకలో ఆందోళనలు


Published on: 28 May 2025 11:26  IST

తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్‌ హాసన్‌ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కర్నాటకలో మంటలు రేపుతున్నాయ్‌. కమల్‌ వ్యాఖ్యలపై కన్నడ పరిరక్షణ వేదిక తీవ్రంగా మండిపడుతోంది. కమల్‌ థగ్‌లైఫ్‌ సినిమాను కర్నాటకలో నిషేధించాలని.. ఆయన సినిమాలను కర్నాటకలో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారుకన్నడిగుల్లో భాషాభిమానం తీవ్రస్థాయికి చేరింది. మాతృభాషను తప్ప మరో భాషను ఒప్పుకోబోమంటున్నారు. ఏదైనా కన్నడలోనే ఉండాలి కన్నడలోనే మాట్లాడాలంటూ రచ్చ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి