Breaking News

చోరీకి వచ్చిన దొంగలు.. బ్యాంకు లోపల ఏం చేశారో


Published on: 28 May 2025 15:07  IST

కర్నాటక విజయపుర జిల్లా బసవన్ బాగేవాడి తాలూకా మనగూలి పట్టణంలోని కెనరా బ్యాంకులో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి, కిటికీ బార్లను కత్తిరించి బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు తొలుత క్షుద్ర పూజలు చేశారు. తరువాత, వారు బ్యాంకులోని డబ్బు, నగలను దోచుకుని పరారయ్యారు. అంతేకాకుండా, బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల హార్డ్ డ్రైవ్‌ను కూడా తీసుకెళ్లిపోయారు. దొంగలు చోరీ చేయడం వరకు ఓకే కానీ ఇలా క్షుద్రపూజలం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి