Breaking News

సమయానికి బస్సులు రావడం లేదని విద్యార్థుల ధర్నా

సమయానికి బస్సులు రావడం లేదని సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బేలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు.


Published on: 21 Sep 2026 17:08  IST

సమయానికి బస్సులు రావడం లేదని సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బేలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు.

ప్రధాన కారణాలు , ఇబ్బందులు

నారాయణఖేడ్ నుండి ఉదయం, సాయంత్రం వేళల్లో పులుకుర్తి వరకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో తాము పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తోందని, దీనివల్ల తమ విద్యాసంవత్సరం, చదువు పాడవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.సమయానికి ప్రత్యేక బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, TGSRTC అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ నిరసన కారణంగా కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అధికారుల హామీధర్నా విరమణ

ధర్నా విషయం తెలుసుకున్న మనూర్ ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారు ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల సమస్యను వివరించారు. స్కూళ్లు, కాలేజీల సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ధర్నాను విరమించారు.

Follow us on , &

ఇవీ చదవండి