Breaking News

భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) దేశంలోని 5 ప్రముఖ ఈ-కామర్స్ మరియు క్విక్-కామర్స్ సంస్థలపై కఠినమైన శిక్షార్హాత్మక చర్యలు చేపట్టింది.

భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) దేశంలోని 5 ప్రముఖ ఈ-కామర్స్ మరియు క్విక్-కామర్స్ సంస్థలపై కఠినమైన శిక్షార్హాత్మక చర్యలు చేపట్టింది.


Published on: 24 Sep 2026 11:30  IST

భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) దేశంలోని 5 ప్రముఖ -కామర్స్ మరియు క్విక్-కామర్స్ సంస్థలపై కఠినమైన శిక్షార్హాత్మక చర్యలు చేపట్టింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన, తప్పుడు ప్రకటనలు, మరియు నిషేధిత ఉత్పత్తుల విక్రయాల నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 23, 2026) ఈ చర్యలు తీసుకున్నట్లు రెగ్యులేటర్ ప్రకటించింది.

కొరడా ఝుళిపించిన 5 ప్రముఖ సంస్థలు:

అమెజాన్

ఫ్లిప్‌కార్ట్

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్

జెప్టో

బిగ్‌బాస్కెట్

చర్యలకు దారితీసిన ప్రధాన కారణాలు:

నిషేధిత & విషపూరిత ఉత్పత్తుల విక్రయం: ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండా, అత్యంత విషపూరితమైన ఉమ్మెత్త గింజలను  ఆన్‌లైన్‌లో విక్రయించడంపై FSSAI తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తప్పుడు ప్రకటనలు : వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న నిర్దిష్ట బ్రాండ్ల ఉత్పత్తులపై ఈ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.

సమాచార లోపాలు: ప్లాట్‌ఫారమ్‌లలో లిస్ట్ చేసిన ఆహార ఉత్పత్తులకు సంబంధించిన సరైన సమాచారం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ వివరాలు ప్రదర్శించకపోవడం.

తెలంగాణలోనూ ముమ్మర తనిఖీలు

ఇదే తరుణంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ అధికారులు సైతం Blinkit, Zepto, JioMart, BigBasket, Amazon, Flipkart వంటి సంస్థల యొక్క 75 వేర్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 1,903 ఎక్స్‌పైరీ (గడువు ముగిసిన) మరియు తప్పుడు లేబుళ్లు ఉన్న ఆహార ఉత్పత్తులను సీజ్ చేసి, 76 కిలోల కుళ్లిన కూరగాయలు, వస్తువులను ధ్వంసం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని కేంద్రాలకు 32 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆన్‌లైన్ ఆహార విక్రయాల్లో వినియోగదారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా FSSAI తన నిఘాను మరింత కఠినతరం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement