Breaking News

పాతబస్తీ మెట్రో అలైన్మెంట్ లో మార్పులు

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో (కారిడార్-6) అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో నిర్మాణ ఖర్చులను తగ్గించేలా ఇంజనీరింగ్ డిజైన్లలో స్వల్ప మార్పులు చేశారు.

Published on: 28 Sep 2026 17:15  IST

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో (కారిడార్-6) అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో నిర్మాణ ఖర్చులను తగ్గించేలా ఇంజనీరింగ్ డిజైన్లలో స్వల్ప మార్పులు చేశారు.

చారిత్రక కట్టడాల రక్షణ:పాతబస్తీలోని పురాతన, చారిత్రక కట్టడాలు, మతపరమైన ప్రార్థనా మందిరాలకు ఎటువంటి నష్టం లేదా ఇబ్బంది కలగకుండా ఈ కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందించారు.

రూట్ మరియు స్టేషన్లు: ఎంజీబీఎస్‌ (MGBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల పొడవునా ఈ మార్గం సాగనుంది. ఈ రూట్‌లో మొత్తం 6 స్టేషన్లను ప్రతిపాదించారు.

ప్రాజెక్టు వ్యయం , టెండర్లు: ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,935 కోట్లు. పనులకు సంబంధించి జనరల్ కన్సల్టెంట్ (GC) టెండర్ల గడువును అక్టోబరు 8 వరకు పొడిగించారు. ఈ మార్పుల ద్వారా భూసేకరణ సమస్యలు తగ్గి, చారిత్రక కట్టడాలు సురక్షితంగా ఉండటమే కాకుండా పనులు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి