Breaking News

కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్టీల్ ప్రాసెసింగ్ సంస్థ బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కలర్ కోటెడ్ స్టీల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది.

కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్టీల్ ప్రాసెసింగ్ సంస్థ బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ,దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి కలర్ కోటెడ్ స్టీల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష్ బన్సాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.


Published on: 12 Oct 2026 13:46  IST

కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్టీల్ ప్రాసెసింగ్ సంస్థ బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ,దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి కలర్ కోటెడ్ స్టీల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష్ బన్సాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

రూ. 800 కోట్ల భారీ విస్తరణ:

జార్ఖండ్‌లోని బొకారో (Bokaro) లో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ డౌన్‌స్ట్రీమ్ స్టీల్ కాంప్లెక్స్ ప్రాజెక్టులో భాగంగా, మొదటి దశ కింద ఈ కొత్త కలర్ కోటింగ్ లైన్‌ను విజయవంతంగా ప్రారంభించారు.మొత్తం రూ. 803 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 5 లక్షల టన్నుల సామర్థ్యం గల స్టీల్ కాంప్లెక్స్‌లో ఇది ఒక కీలకమైన మైలురాయి.అక్టోబర్ 5న ఈ ప్లాంట్‌కు సంబంధించి వాణిజ్య కార్యకలాపాల అనుమతి లభించింది.

ప్రభుత్వ PLI స్కీమ్ మద్దతు:

ప్రత్యేక రకాల ఉక్కు తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ కింద ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కంపెనీకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి.

మార్కెట్ అవసరాలు , ఉపయోగాలు:

కలర్ కోటెడ్ స్టీల్ అనేది తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నికనిచ్చే ప్రీ-పెయింటెడ్ మెటల్.దేశంలో మౌలిక సదుపాయాలు , భవన నిర్మాణాలు, ఆటోమొబైల్, గృహోపకరణాలు , పునరుత్పాదక శక్తి మరియు రక్షణ రంగాల్లో దీనికి భారీగా డిమాండ్ పెరుగుతోంది.

ఇప్పటివరకు కేవలం స్టీల్ కాయిల్స్, షీట్లు, పైపులు, మరియు TMT బార్లను మాత్రమే తయారు చేస్తూ వచ్చిన BMW ఇండస్ట్రీస్, ఈ కొత్త కలర్ కోటెడ్ ఉక్కు తయారీతో మార్కెట్లో మరింత విలువైన అనుబంధ ఉత్పత్తులను అందించే అగ్రశ్రేణి కంపెనీల జాబితాలోకి చేరింది. ప్రస్తుతం కేవలం దేశీయ మార్కెట్ అవసరాలను తీరుస్తున్న ఈ సంస్థ, భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతులు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement