Breaking News

ఓపెన్‌ఏఐ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్‌లో రహస్య వినికిడి, రికార్డింగ్ పరికరాలు అమర్చిన వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది.

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్‌లో రహస్య వినికిడి, రికార్డింగ్ పరికరాలు అమర్చిన వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది.


Published on: 14 Oct 2026 12:34  IST

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలోని ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ రూమ్‌లో రహస్య వినికిడి, రికార్డింగ్ పరికరాలు అమర్చిన వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ గూఢచర్యం ఆరోపణలపై కంపెనీకి చెందిన ఇంజనీర్, సౌదీ అరేబియా జాతీయుడైన అబ్దుల్‌రహమాన్ అల్ఫోజాన్‌ (35) ను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది.

పరికరాల ఆవిష్కరణ: సెప్టెంబర్ 30, 2026 న ఓపెన్ ఏఐ సెక్యూరిటీ బృందం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ రహస్య పరికరం బయటపడింది. అత్యంత రహస్యమైన చర్చలు జరిగే కాన్ఫరెన్స్ రూమ్‌లోని టీవీ వెనుక ఉన్న యూఎస్‌బీ పోర్టులో, టిష్యూ పేపర్‌లో చుట్టి ఈ అధునాతన ఆడియో రికార్డింగ్ పరికరాన్ని అమర్చారు.

నిందితుడిని పట్టించిన ఏఐ టెక్నాలజీ: ఈ పరికరం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పెట్టారు అనే విషయాన్ని కనిపెట్టడానికి ఓపెన్‌ఏఐ సొంత ఏఐ మోడల్స్ (AI Models) మరియు ఫోరెన్సిక్ విశ్లేషణను ఉపయోగించింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ పరికరాన్ని ప్లాంట్ చేసింది తమ వద్ద పనిచేస్తున్న అల్ఫోజాన్ అని ఏఐ సాయంతో గుర్తించి, సమాచారాన్ని ఎఫ్‌బీఐకి చేరవేసింది.

మరిన్ని పరికరాలు పెట్టే ప్లాన్: నిందితుడి బ్యాగును తనిఖీ చేయగా అందులో వాలెట్, ఐడీ కార్డులతో పాటు అదే రకానికి చెందిన మరొక రహస్య రికార్డింగ్ పరికరం కూడా లభ్యమైంది. ఆఫీసులోని మరికొన్ని కీలక విభాగాల్లో కూడా వీటిని అమర్చాలని అతను భావించినట్లు దర్యాప్తులో తేలింది.

డేటా భద్రతపై ప్రకటన: నిందితుడైన ఇంజనీర్‌ను ఓపెన్‌ఏఐ వెంటనే ఉద్యోగం నుండి తొలగించింది. అయితే, కంపెనీకి చెందిన అత్యంత విలువైన ఏఐ మోడల్ వెయిట్స్ , సోర్స్ కోడ్ లేదా కస్టమర్ల డేటా ఏదీ కూడా చోరీకి గురికాలేదని, అంతా సురక్షితంగానే ఉందని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.అమెరికా భద్రతా అధికారులు ఈ కేసును దేశ భద్రతకు సంబంధించిన సీరియస్ అంశంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement