Breaking News

భూ భారతి సర్వేను ప్రారంభించిన మంత్రులు


Published on: 03 Jun 2025 15:20  IST

మధిర నియోజక వర్గం, ఎర్రుపాలెం మండలం, ములుగుమాడులో మంగళవారం భూ భారతి సర్వేను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఇది పవిత్ర మైన కార్యక్రమమని, ఇది శుభసూచకమని, ఇదొక విప్లవాత్మకమైన కార్యక్రమమని అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి