Breaking News

మీకేంటి సారీ చెప్పేది..నేనే నా సినిమాలు రిలీజ్ చేయను


Published on: 03 Jun 2025 16:23  IST

కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ విడుదల వాయిదా పడింది. ప్రస్తుతానికి కన్నడలో ‘థగ్ లైఫ్’ సినిమాను విడుదల చేసేది లేదని కమల్ హాసన్ తరపు కౌన్సిల్ కర్ణాటక హైకోర్టుకు స్పష్టం చేసింది. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని కమల్ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. కోర్టు చెప్పినా డోంట్ కేర్ అన్నట్లు తన వ్యాఖ్యలనే సమర్థించుకున్నారు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందన్న తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోగా.. ‘‘అంతా నా ఇష్టం’’ అనే రీతిలో కోర్టుకు బదులిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి