Breaking News

కాకాణి కస్టడీపై వాదనలు పూర్తి.. తీర్పు ఏంటంటే


Published on: 03 Jun 2025 18:21  IST

క్వార్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్‌ కస్టడీ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్‌, అలాగే బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 5న (గురువారం) న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. కేసులో ముద్దాయిలు ఇచ్చిన సమాచారం మేరకు కాకాణిని కస్టడీకి తీసుకుంటే లోతైన సమాచారం సేకరించవచ్చన్నారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారని... పోలీస్ కస్టడీకి ఇస్తారన్న నమ్మకం ఉందని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి