Breaking News

అర్ధరాత్రి బుల్డోజర్ రాకతో పరుగులు పెట్టిన జనం..


Published on: 04 Jun 2025 16:34  IST

మల్కాజిగిరిలో అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని, తన భవనంలో కిరాయికి ఇచ్చిన 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు. ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ షాపుల్లో 15 ఏళ్లకుపైగా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని కోరారు. దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ, దయచేసి కొంత సమయం ఇవ్వండి” అని కోరారు.కానీ బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు

Follow us on , &

ఇవీ చదవండి